![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -440 లో.. మీ నాన్న చేసిన తప్పు దాచి ఈ అమ్మ గురించి భయపడ్డారు. ఇద్దరు ఎన్నో భరించారు. నా భర్త జీవితంలో మరొక ఆడది ఉందని తెలియడంతో నేను తట్టుకోలేకపోతున్నానని రాజ్ కి తన బాధని చెప్పుకుంటుంది అపర్ణ. మరొకవైపు మాయని రౌడీ లు తీసుకొని వెళ్తుంటారు. ఒక కార్ ని కావ్య మరొక కార్ ని కళ్యాణ్, అప్పు లు ఫాలో అవుతుంటారు.
ఆ తర్వాత అప్పుడే కావ్యకి మాయ ఒక వీడియో పంపిస్తుంది. అందులో నేను తప్పు చేసాను.. నన్ను క్షమించు.. ఆ బాబుకి మీ మామయ్య గారికి ఏం సంబంధం లేదు.. నా వెనకాల ఉన్నవాళ్ళు ఇదంతా చేయించారు. నన్ను క్షమించండి అంటూ ఒక వీడియో పెడుతుంది. అది చూసి నా నమ్మకమే నిజం అయిందన్న మాట అని కావ్య అనుకోని.. ఎలాగైనా మాయని కాపాడాలని అనుకుంటుంది. ఆ తర్వాత రౌడీలు వెళ్తున్న ఒక కార్ ని ముందు కు వెళ్లి ఆపుతుంది కావ్య. ఆ కార్ లో మాయ ఉండదు. మాయ ఎక్కడ అని కావ్య అడుగగా వేరే కారులో ఉందని చెప్పి కావ్య ఫోన్ లాక్కొని రౌడీ వెళ్తాడు. ఉన్న ఒక్క ఆధారం కూడా లేదు ఇప్పుడు కచ్చితంగా మాయని పట్టుకోవాలని కావ్య అనుకొని.. డ్రైవర్ ఫోన్ నుండి కళ్యాణ్ కి చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో లొకేషన్ షేర్ చెయ్యమని చెప్తుంది. మరొకవైపు రుద్రాణి, రాహుల్ లు అనామిక దగ్గరికి వెళ్లి.. నీ భర్త కళ్యాణ్, అప్పు లు హోటల్ లో ఉన్నారు.. ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్ళని పట్టుకోమని చెప్తారు. దాంతో ధాన్యలక్ష్మి దగ్గరికి అనామిక వెళ్లి.. మీరు నాతో రండి అంటూ తనకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మన ప్లాన్ ప్రకారం అప్పు, కళ్యాణ్ లు హోటల్ కి వెళ్తారు. అక్కడ మన మనిషి డోర్ వేస్తారు.. మీడియా వస్తుందని రుద్రాణి రాహుల్ లు అనుకుంటారు. ఆ తర్వాత నిజంగానే రౌడీలు హోటల్ లోపలకి వెళ్లడంతో అప్పు, కళ్యాణ్ లో కూడా లోపలికి వెళ్తారు. రిసెప్షన్ లో రౌడీలు ఎక్కడ అని అడుగగా.. వాళ్ళు చెప్పిన రూమ్ కి కళ్యాణ్, అప్పులు వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళగానే డోర్ వేస్తారు.
ఆ తర్వాత మీడియా వాళ్ళు వచ్చి ఇలా ఎందుకు హోటల్ కి వచ్చారంటు ఇద్దరిని అడుగుతారు. అప్పుడే కావ్య వచ్చి మీరు అనుకుంటున్నది తప్పు వేరే పని మీద వచ్చామని కావ్య అంటుంది. అయిన మీడియా వాళ్ళు తప్పుగా మాట్లాడుతుంటే అప్పు, కళ్యాణ్ లను కావ్య తీసుకొని వెళ్తుంటుంది అప్పుడే వాళ్ళకి అనామిక, ధాన్యలక్ష్మి లు ఎదురుపడతారు. అదంతా న్యూస్ లో రావడం చూసి కనకం షాక్ అవుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, అప్పులని అనామిక తప్పుపడుతుంది. అప్పుడే కనకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |